Shaadi Munarak - ఇది అందరి సినిమా
Sunday,March 07,2021 - 03:07 by Z_CLU
స్టార్ హీరోలతో భారీ బడ్జెట్ చిత్రాలనే కాదు.. యూత్‌ను, ఫ్యామిలీ ఆడియెన్స్ హృదయాలు హత్తుకునేలా కూల్ అండ్ ప్లెజెంట్ మూవీస్‌ను అందిస్తూ ఎన్నోసూపర్ డూపర్ హిట్స్‌ను సొంతం చేసుకున్న ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్ నుండి వచ్చిన మరో ప్లజంట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘షాదీ ముబారక్’.
పద్మశ్రీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మార్చి 5న గ్రాండ్‌గా విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. బుల్లితెర స్టార్ సాగర్ హీరోగా పరిచయమైన ఈ సినిమా అన్ని వర్గాల్ని ఎట్రాక్ట్ చేస్తోంది. మరీ ముఖ్యంగా ఈ వీకెండ్ ఫ్యామిలీ ఆడియన్స్ కు ఇదే ఫస్ట్ ఛాయిస్ గా మారింది.
ఈ సందర్భంగా తన సినిమా హిట్ చేసిన అందరికీ సాగర్ థ్యాంక్స్ చెప్పాడు.
“ఈ జర్నీలో మాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్యూ వెరీమచ్. ఒక క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ వచ్చి చాలా రోజులైంది. ఆడియన్స్ తో కలిసి థియేటర్లో సినిమా చూశాను. అన్ని ఏజ్ గ్రూప్స్ వారు ఎంజాయ్ చేస్తున్నారు. ఆ స్క్రిప్ట్‌లోనే మంచి ఎంటర్టైన్ మెంట్ కామెడీ కుదిరింది. ఇంత మంచి కథ ఇచ్చిన పద్మశ్రీ గారికి, మాకు సపోర్ట్ చేసిన దిల్‌రాజు, శిరీష్ గారికి నా హృదయపూర్వక దన్యవాదాలు“