Dil Raju - నా జడ్జిమెంట్ నిజమైంది
Thursday,March 04,2021 - 12:42 by Z_CLU
షాదీ ముబారక్ సినిమా, రిలీజ్ కు ముందే తన జడ్జిమెంట్ నిజమని ప్రూవ్ చేసిందంటున్నారు ప్రొడ్యూసర్ దిల్ రాజు. రేపు ఈ సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్న ఈ బడా ప్రొడ్యూసర్.. సినిమా గురించి ఉన్నదున్నట్టు మాట్లాడారు.
⇒ ఓరోజు సాగర్ నా దగ్గరకు వచ్చి ట్రైలర్ చూపించినప్పుడు చాలా బావుందని చెప్పాను. అక్కడ నుంచి ఇంకా కష్టాలు స్టార్ట్ అయ్యాయి. సినిమా చూసినప్పుడు కొన్ని కరెక్షన్స్ చెప్పడమే కాకుండా, మా టీమ్ సపోర్ట్ కూడా అందించాను. నెమ్మదిగా సినిమా స్టార్ట్ అయ్యింది. ఫైనాన్సియల్‌గా కూడా కాస్త సపోర్ట్ చేసి సినిమాను పూర్తి చేశాను. అప్పుడే కోవిడ్ స్టార్ట్ అయ్యింది. లాస్ట్ ఇయర్ మార్చిలో రావాల్సిన ఈ సినిమా కోవిడ్ ఎఫెక్ట్‌కు ఈ మార్చి 5న వస్తుంది. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది.
⇒ సాధారణంగా ఓ సినిమా అనుకున్నప్పుడు స్క్రిప్ట్ నుంచి ట్రావెల్ అయితేనే బ్యానర్ పేరు ఇస్తాను. కానీ ఈ సినిమా మధ్యలో జాయిన్ అయ్యాను. అయితే ఈ టీమ్ మంచి సినిమా చేశారనిపించింది. సినిమాను ప్రాపర్‌గా రిలీజ్ చేయించాలని అనుకునే మా బ్యానర్ ద్వారా సినిమాను రిలీజ్ చేయడానికి నిర్ణయించుకున్నాను.
⇒ సాధారణంగా నా జడ్జ్మెంట్ మీద నమ్మకంతోనే డిస్ట్రిబ్యూటర్స్ ముందుకు వస్తారు. శాటిలైట్వాళ్లు, డిజిటల్ వాళ్లు సినిమా చూడగానే వెంటనే కొనేశారు. అక్కడే నా జడ్జ్మెంట్ కరెక్ట్ అయ్యింది.
⇒ టిక్కెట్టు కొని థియేటర్‌కు వచ్చే ప్రేక్షకుడు రేపు బయటకు వెళ్లేటప్పుడు నవ్వుతూ వెళతారనే గ్యారంటీ నేను ఇస్తాను. వెరీ గుడ్ ఎంటర్టైనర్. పద్మశ్రీగారు సినిమా ఇంట్రెస్టింగ్గా తెరకెక్కించారు. టీవీలో సాగర్ చాలా ఫేమస్.. తను సినిమాలకు యంగ్ హీరో. దశ్యా రంగనాథ్ చాలా ఈజీగా నటించింది. తను నటన చూసి ఆ అమ్మాయికి క్రెడిట్ ఇవ్వాలా, లేక డైరెక్టర్కా అనిపించింది. డెబ్బై శాతం సినిమా చూసి నవ్వుతూనే ఉంటారు. ఎంటైర్ టీమ్‌కు ఆల్ ది బెస్ట్.