RangDe - మరో క్యాచీ సాంగ్ రిలీజ్

Saturday,February 27,2021 - 01:07 by Z_CLU

‘రంగ్ దే’ సినిమా మార్చి 26న రిలీజ్ అవుతోంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్ ఊపందుకుంది. సకుటుంబ సమేతంగా చూడతగ్గ చిత్రంగా దీన్ని తెరకెక్కించాడు దర్శకుడు ‘వెంకీ అట్లూరి’. యూత్ స్టార్ నితిన్, నాయిక కీర్తి సురేష్ ల జంట వెండితెరపై కనువిందు చేయనుందన్న నమ్మకం విడుదల అవుతున్న ప్రచార చిత్రాలు, వీడియో దృశ్యాలు, గీతాలు మరింత పెరిగేలా చేస్తున్నాయి.

మూవీకి సంబంధించి ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ సాంగ్ కు కోటి కి పైగా వ్యూస్ వచ్చిన నేపథ్యంలో.. ఇప్పుడు మరో లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు.

“సింపుల్ గుండే లైఫు.. టెంపుల్ రన్ లా మారే..” అంటూ సాగే ఈ సాంగ్ కు శ్రీమణి సాహిత్యం సమకూర్చారు. గాయకుడు సాగర్ గాత్రంలో ఈ గీతం ఆకట్టుకుంటుంది. ప్రసిద్ధ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఈ గీతానికి అందించిన స్వరాలు సంగీత ప్రియులను ఎంతగానో అలరిస్తాయి.

ఫుల్ సాంగ్ కోసం క్లిక్ చేయండి

సినిమా హీరోహీరోయిన్లు నితిన్, కీర్తి సురేష్ లపై చిత్రీకరించిన ఈ గీతాన్ని వెండితెరపై వినోద భరితంగా వీక్షకులకు కనువిందు కలిగేలా చిత్రీకరించారు దర్శకుడు వెంకీ అట్లూరి. శేఖర్ ఈ పాటకు కొరియోగ్రాఫర్.