సవ్యసాచి కీలకమైన షెడ్యూల్ పూర్తి

Saturday,December 16,2017 - 01:53 by Z_CLU

చందు మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య చేస్తున్న సినిమా సవ్యసాచి. ఈ మూవీకి సంబంధించి కీలకమైన షెడ్యూల్ పూర్తిచేశారు. హైదరాబాద్ లో వేసిన ప్రత్యేకమైన సెట్ లో హీరో నాగచైతన్య, మరో కీలక పాత్ర పోషిస్తున్న మాధవన్ పై ఓ భారీ షెడ్యూల్ పూర్తిచేశారు. ఈ వివరాల్ని తెలుపుతూ మాధవన్ ఓ స్టిల్ కూడా పోస్ట్ చేశాడు.

ప్రేమమ్ లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత చైతూ-చందు కాంబినేషన్ లో వస్తోంది సవ్యసాచి. అయితే ప్రేమమ్ కు సవ్యసాచికి ఎలాంటి సంబంధం ఉండదు. ఇదొక కంప్లీట్ కొత్త కథ. హీరో ఎడమ చేయి అతడితో సంబంధం లేకుండా దాని ఇష్టమొచ్చినట్టు ప్రవర్తిస్తుంది. దాని వల్ల హీరోకు కలిగే ఇబ్బందులే ఈ సినిమా.

సవ్యసాచి సినిమాతో కన్నడ బ్యూటీ నిధి అగర్వాల్ తెలుగుతెరకు పరిచయమౌతోంది. బాహుబలి తర్వాత కీరవాణి సంగీతం అందిస్తున్న సినిమా ఇదే. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మాతగా ఈ సినిమా తెరకెక్కుతోంది.