మరికొన్ని గంటల్లో అజ్ఞాతవాసి టీజర్

Saturday,December 16,2017 - 10:36 by Z_CLU

పవన్ అభిమానులతో పాటు టోటల్ టాలీవుడ్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న టైం రానే వచ్చింది. మరికొన్ని గంటల్లో అజ్ఞాతవాసి టీజర్ విడుదలకానుంది. పవన్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో మోస్ట్ ఎవెయిటింగ్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా టీజర్ ను 4 గంటల ప్రాంతంలో విడుదల చేసే ఛాన్స్ ఉంది.

కొన్ని రోజులుగా అజ్ఞాతవాసి మేనియా కొనసాగుతోంది. మరీ ముఖ్యంగా రీసెంట్ గా రిలీజైన గాలివాలుగా సాంగ్ సూపర్ హిట్ అవ్వడంతో మూవీపై అంచనాలు మరింత పెరిగాయి. రిలీజైన 2 రోజుల్లో 2 మిలియన్ వ్యూస్ వచ్చాయి ఈ పాటకి. అందుకే ఇప్పుడు టీజర్ పై మరింత ఫోకస్ పెరిగింది.

పవన్ 25వ చిత్రంగా వస్తున్న అజ్ఞాతవాసి సంక్రాంతికి విడుదలకానుంది. జనవరి 10న సినిమా థియేటర్లలోకి వస్తుంది. అటు ఓవర్సీస్ లో మాత్రం 9వ తేదీ నుంచే ప్రీమియర్స్ షురూ కాబోతున్నాయి. యూఎస్ లో ఈ సినిమాను 547 లొకేషన్లలో విడుదల చేస్తున్నారు. టాలీవుడ్ కు సంబంధించి ఇదొక రికార్డు.