శరవేగంగా సాగుతున్న సైరా షూటింగ్

Saturday,December 16,2017 - 03:07 by Z_CLU

చిరంజీవి 151వ సినిమా సైరా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. డిసెంబర్ 6న గ్రాండ్ గా ప్రారంభమైన  ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈనెల 22 వరకు కొనసాగుతుంది. ప్రస్తుతం అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన భారీ సెట్ లో చిరంజీవిపై యాక్షన్ ఎపిసోడ్స్ చిత్రీకరిస్తున్నారు. ఫైట్ మాస్ట‌ర్ లీ విట్టేక‌ర్ సార‌థ్యంలో కీల‌క యాక్ష‌న్ సన్నివేశాలు తెర‌కెక్కించ‌నున్నారు.

ఈ క్రేజీ చిత్రానికి స్టైలిష్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ర‌త్న‌వేలు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ హిస్టారిక‌ల్ చిత్రాన్ని భారీ బ‌డ్జెట్ తో  మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీపై నిర్మిస్తున్నారు.

స్వతంత్ర ఉద్యమ కాలానికి చెందిన కథతో తెరకెక్కుతున్న సైరా సినిమాలో చిరంజీవి సరసన నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. కన్నడ నటుడు సుదీప్, బిగ్ బి అమితాబ్, తమిళ స్టార్ విజయ్ సేతుపతి కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.