నాగచైతన్య సినిమాకు డేట్స్ ఫిక్స్

Saturday,March 03,2018 - 03:21 by Z_CLU

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై చందు మొండేటి దర్శకత్వంలో సవ్యసాచి సినిమా చేస్తున్నాడు నాగచైతన్య. ఈ మూవీకి సంబంధించి తాజాగా కొన్ని డేట్స్ ఫిక్స్ చేశారు. ఉగాది కానుకగా మార్చి 18న సవ్యసాచి ఫస్ట్ లుక్ విడుదల చేయబోతున్నారు. ఇక సినిమాను జూన్ 14న థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు. ఈ మేరకు మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ ఇచ్చారు.

నిజానికి ఈ సినిమాను మే 24 లేదా 25వ తేదీన విడుదల చేయాలనుకున్నారు. కానీ ఆ టైమ్ లో వర్మ-నాగ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఆఫీసర్ సినిమాను విడుదల చేయాలని నిర్ణయించారు. దీంతో సవ్యసాచి సినిమాను జూన్ 14న విడుదల చేయాలని నిర్ణయించారు.

చందు మొండేటి దర్శకత్వంలో కంప్లీట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతోంది సవ్యసాచి సినిమా. ఈ సినిమాలో భూమిక, మాధవన్ రెండు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్ గా పరిచయమౌతోంది. కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.