సరిలేరు నీకెవ్వరు 2 రోజుల వసూళ్లు

Monday,January 13,2020 - 05:13 by Z_CLU

సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి వచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమా రెండో రోజు కూడా తన ఊపు కొనసాగించింది. మొదటి రోజు 32 కోట్ల రూపాయల షేర్ సాధించిన ఈ సినిమా, రెండో రోజు తన కౌంట్ ను 41 కోట్ల 52 లక్షల రూపాయలకు పెంచుకుంది. సెకెండ్ డే వచ్చేసరికి అల వైకుంఠపురములో సినిమాతో థియేటర్లు షేర్ చేసుకోవాల్సి రావడంతో సరిలేరు నీకెవ్వరుకు స్క్రీన్ కౌంట్ తగ్గింది. ఫలితంగా షేర్లు కూడా కాస్త తగ్గాయి.

అయితే షేర్లు తగ్గినా, థియేటర్లలో ఆక్యుపెన్సీ మాత్రం పడిపోలేదు. సినిమాకు పాజిటివ్ టాక్ రావడం, ఎన్నడూలేని విధంగా మహేష్ మాస్ లుక్ లో మెస్మరైజ్ చేయడంతో సరిలేరు నీకెవ్వరు సినిమా నిలకడగా మరో 2 వారాల పాటు నడిచే అవకాశం ఉందని ట్రేడ్ అంచనా వేస్తోంది. సో.. వసూళ్ల విషయంలో ఎలాంటి బెంగ లేదు.

సరిలేరు నీకెవ్వరు 2 రోజుల షేర్స్
నైజాం – రూ. 11.85 కోట్లు
సీడెడ్ – రూ. 5.60 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 5.92 కోట్లు
ఈస్ట్ – రూ. 4.04 కోట్లు
వెస్ట్ – రూ. 3.15 కోట్లు
గుంటూరు – రూ. 5.65 కోట్లు
నెల్లూరు – రూ. 1.55 కోట్లు
కృష్ణా – రూ. 3.76 కోట్లు