రవితేజ 'డిస్కోరాజా' టీజర్ 2.0 రిలీజయింది

Monday,January 13,2020 - 04:49 by Z_CLU

సంక్రాంతి పండగ సీజన్లో రవితేజ ‘డిస్కోరాజా’ కూడా హల్ చల్ చేస్తుంది. రీసెంట్ గా ఈ సినిమా నుండి ఓ టీజర్ రిలీజ్ చేసి స్టాండర్డ్స్ ఎలివేట్ చేసిన మేకర్స్, ఇప్పుడు టీజర్ 2 రివీల్ చేశారు. అయితే ఈ టీజర్ లో విలన్ ని ఎలివేట్ చేశారు.

‘సేతు…. అంటే భయం పుట్టాలి…’ అనే విలన్ డైలాగ్ కి… మాస్ మాహారాజ్ అవుట్ స్టాండింగ్ ఎంట్రీ అదుర్స్ అనిపిస్తుంది. ఆల్మోస్ట్ వయొలెన్స్ కి దూరంగా ఉండే విలన్ లైఫ్ లో రవితేజని ఓ కొత్త చాలెంజ్ గా పరిచయం చేశారు మేకర్స్ ఈ టీజర్ లో. అంతకు మించి డిస్కోరాజా కథేంటన్నది రివీల్ చేయలేదు మేకర్స్.

V.I. ఆనంద్ డైరెక్షన్ లో తెరకెక్కుతుంది డిస్కోరాజా. నభా నతేష్, పాయల్ రాజ్ పుత్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ కంపోజర్. SRT ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమా జనవరి 24 న రిలీజవుతుంది.