సరిలేరు నీకెవ్వరు 24 రోజుల వసూళ్లు

Tuesday,February 04,2020 - 01:24 by Z_CLU

సంక్రాంతి కానుకగా వచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమా ఈరోజు గ్రాండ్ గా 25వ రోజులోకి ఎంటరైంది. నిన్నటితో 24 రోజుల రన్ పూర్తిచేసుకున్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో భారీ వసూళ్లు సాధించింది. నిన్నటి వసూళ్లతో కలుపుకొని ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో 121 కోట్ల రూపాయల షేర్ వచ్చినట్టు మేకర్స్ ఎనౌన్స్ చేశారు.

నైజాంలో ఈ సినిమా ఆల్ మోస్ట్ 40 కోట్ల మార్క్ అందుకుంది. అటు ఉత్తరాంధ్రలో 20 కోట్ల మార్క్ టచ్ చేసిన ఈ సినిమా.. గుంటూరు, కృష్ణాలో 10 కోట్ల షేర్ అందుకునే దిశగా దూసుకుపోతోంది. ఇక వరల్డ్ వైడ్ ఈ సినిమాకు 144 కోట్ల రూపాయల షేర్ వచ్చింది.

ఏపీ, నైజాం 24 రోజుల షేర్
నైజాం – రూ. 39.77 కోట్లు
సీడెడ్ – రూ. 17.4 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 20.10 కోట్లు
ఈస్ట్ – రూ. 11.14 కోట్లు
వెస్ట్ – రూ. 7.87 కోట్లు
గుంటూరు – రూ. 9.95 కోట్లు
నెల్లూరు – రూ. 5.39 కోట్లు
కృష్ణా – రూ. 9.34 కోట్లు