సరిలేరు నీకెవ్వరు 6 రోజుల వసూళ్లు

Friday,January 17,2020 - 12:02 by Z_CLU

మహేష్ హీరోగా నటించిన సంక్రాంతి మూవీ సరిలేరు నీకెవ్వరు, సక్సెస్ ఫుల్ గా 6 రోజుల రన్ పూర్తిచేసుకుంది. ఈ 6 రోజుల్లో 78 కోట్ల రూపాయల వసూళ్లు రాబట్టింది ఈ సినిమా. 6వ రోజు కనుమ కావడంతో ఏపీ,నైజాంలో దాదాపు అన్ని థియేటర్లు హౌజ్ ఫుల్స్ నడిచాయి. దీంతో రిలీజైన 6వ రోజుకే బ్రేక్ ఈవెన్ అయింది సరిలేరు నీకెవ్వరు.

తాజా వసూళ్లతో సరిలేరు నీకెవ్వరు సినిమా సంక్రాంతి ఛాంపియన్ అంటూ సరికొత్త పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. అనీల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ నటించిన ఈ సినిమా సూపర్ స్టార్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచే అవకాశాలున్నాయి. అటు ఓవర్సీస్ లో కూడా ఈ సినిమాకు భారీ వసూళ్లు వస్తున్నాయి.

ఏపీ,నైజాం 6 రోజుల షేర్స్
నైజాం – రూ. 25.65 కోట్లు
సీడెడ్ – రూ. 11.35 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 11.80 కోట్లు
ఈస్ట్ – రూ. 7.23 కోట్లు
వెస్ట్ – రూ. 5.06 కోట్లు
గుంటూరు – రూ. 7.72 కోట్లు
నెల్లూరు – రూ. 2.86 కోట్లు
కృష్ణా – రూ. 6.27 కోట్లు