స‌మంత `ఓ బేబి` ఫ‌స్ట్ లుక్‌ ఇదే

Wednesday,May 22,2019 - 05:15 by Z_CLU

ఇంతకుముందు ఓ బేబి సినిమా నుంచి ఓ స్టిల్ వచ్చింది. కానీ అది ప్రీ-లుక్. ఇప్పుడు ఫస్ట్ లుక్ విడుదల చేశారు. సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ 55 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా ఈ లుక్ రిలీజ్ చేశారు.

ఓ కొరియన్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ మూవీలో సమంత, లక్ష్మి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇతర కీలక పాత్రల్లో రావు రమేష్, రాజేంద్రప్రసాద్ కనిపిస్తారు. చాన్నాళ్ల గ్యాప్ తర్వాత నందినీ రెడ్డి ఈ సినిమాతో మెగాఫోన్ పట్టుకున్నారు.

ఓ బేబీ సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ నడుస్తోంది. అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి ఈ చిత్రాన్ని జూలైలో విడుద‌ల చేయాల‌నుకుంటున్నారు. మిక్కి జె.మేయ‌ర్ సంగీతం అందించిన ఈ చిత్రానికి రిచ‌ర్డ్ ప్ర‌సాద్ సినిమాటోగ్రాఫర్. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, గురు ఫిలింస్‌, క్సాస్ పిక్చ‌ర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సాంకేతిక వ‌ర్గం:
ద‌ర్శ‌క‌త్వం: బి.వి.నందినీ రెడ్డి
నిర్మాత‌లు: సురేష్ బాబు, సునీత తాటి, టి.జి.విశ్వ‌ప్ర‌సాద్‌, హ్యువు థామ‌స్ కిమ్
నిర్మాణ సంస్థ‌లు: సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, గురు ఫిలింస్‌, క్రాస్ పిక్చ‌ర్స్‌
స‌హ నిర్మాత‌లు: విజ‌య్ దొంకాడ‌, దివ్యా విజ‌య్‌
మ్యూజిక్‌: మిక్కి జె.మేయ‌ర్‌
కెమెరా: రిచ‌ర్డ్ ప్ర‌సాద్
డైలాగ్స్‌: ల‌క్ష్మీ భూపాల్‌
ఎడిట‌ర్‌: జునైద్ సిద్ధిఖీ
ప్రొడ‌క్ష‌న్ డిజైన్‌:జ‌య‌శ్రీ ల‌క్ష్మీ నారాయ‌ణ‌
ఆర్ట్‌: విఠ‌ల్‌.కె