అల్లు అర్జున్ సినిమాపై హీరోయిన్ క్లారిటీ

Wednesday,May 22,2019 - 04:15 by Z_CLU

ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు అల్లు అర్జున్. పూజా హెగ్డే ఇందులో హీరోయిన్ గా నటిస్తుంది. త్రివిక్రమ్ సినిమాలంటే సెకెండ్ హీరోయిన్ ఉండాల్సిందే కదా. అలా ఈ సినిమాలో కూడా రెండో హీరోయిన్ గా నివేత థామస్ ను తీసుకున్నారంటూ గాసిప్స్ మొదలయ్యాయి.

ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. హీరోయిన్ పాత్ర అనే కంటే, ఓ కీలకమైన పాత్ర కోసం ఆమెను సెలక్ట్ చేశారంటూ స్టోరీలు వచ్చేశాయి. వీటిపై నివేత థామస్ క్లారిటీ ఇచ్చింది. బన్నీ-త్రివిక్రమ్ సినిమాకు తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టంచేసింది.

నిజానికి క్యారెక్టర్ బాగుంటే, ఏ హీరో అయినా, డైరక్టర్ ఎవరైనా అందులో నటించడానికి నివేతకు అభ్యంతరం లేదు. మంచి పాత్ర దొరికితే బన్నీ సినిమాకు కూడా ఆమె ఓకే చెబుతుంది. కానీ తనను ఎవరూ సంప్రదించకుండా, తన ప్రమేయం లేకుండా గాసిప్స్ వచ్చేసరికి నివేత ఎలర్ట్ అయింది. ప్రస్తుతం ఈ బ్యూటీ.. బ్రోచేవారెవరురా అనే సినిమాలో నటిస్తోంది.