పూరీజగన్నాధ్ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ ?

Thursday,October 27,2016 - 11:26 by Z_CLU

ఎన్టీఆర్-పూరీ జగన్నాధ్ కాంబినేషన్ లో సినిమా వస్తుందో రాదో ప్రస్తుతానికైతే సస్పెన్స్. కానీ ఈ గ్యాప్ లో పూరి మాత్రం ఖాళీగా ఉండట్లేదు. ఈ దర్శకుడు ఇప్పుడు ఏకంగా ముంబయి టూర్ ప్లాన్ చేశాడు. కథ, స్క్రీన్ ప్లే రాసుకోవడానికి బ్యాంకాక్ వెళ్లే పూరి జగన్నాధ్ ఈసారి ముంబయి టూర్ పెట్టుకోవడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. తాజా సమాచారం ప్రకారం… సల్మాన్ కు కథలు వినిపించడానికే పూరీ జగన్నాధ్ ఛలో ముంబయి అంటున్నాడని టాక్.

     ఫిలింనగర్ నుంచి వస్తున్న సమాచారం ప్రకారం… సల్మాన్ ఖాన్ కు ఇజం స్టోరీని వినిపించేందుకే పూరి జగన్నాధ్ ముంబయి వెళ్తున్నాడట. ఇజం సినిమా డీవీడీతో పాటు.. టెంపర్ మూవీ డీవీడీని కూడా సల్మాన్ కు చూపిస్తాడట. ఈ సినిమా రీమేక్ లో నటించడం తన వల్లకాదని ఇప్పటికే అభిషేక్ బచ్చన్ చేతులెత్తేశాడు. ఇప్పుడు సల్మాన్ ను ఒప్పించే పనిలో పడ్డాడట పూరి. ఈ రెండు సినిమాలతో పాటు అమ్మా-నాన్న-ఓ తమిళ అమ్మాయి సినిమా డీవీడీని కూడా సల్మాన్ చేతిలో పెట్టే ఆలోచనలో పూరీ ఉన్నట్టు తెలుస్తోంది.