పని పూర్తిచేస్తున్న బాలయ్య...

Thursday,October 27,2016 - 11:36 by Z_CLU

బాలకృష్ణ సెంచరీ మూవీ గౌతమీపుత్ర శాతకర్ణి షూటింగ్ క్లయిమాక్స్ కు వచ్చింది. ఈ సినిమా షూటింగ్ ను నవంబర్ రెండో వారానికి పూర్తిచేయాలని క్రిష్ నిర్ణయించాడు. ఈ మేరకు షూటింగ్ ను పరుగులు పెట్టిస్తున్నాడు. అటు బాలయ్య కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా షూటింగ్ కు హాజరవుతున్నాడు. ఒక పాట కొన్ని చిన్న సన్నివేశాలు మినహా మేజర్ షూటింగ్ ను కంప్లీట్ చేయాలని యూనిట్ నిర్ణయించింది. మిగిలిన ఆ ఒక్క పాట కోసం జార్జియా వెళ్లాలని నిర్ణయించిన యూనిట్… అంతకంటే ముందే పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తిచేయాలని ఫిక్స్ అయింది. ఈ సినిమా కంప్లీట్ అయిన వెంటనే… కృష్ణవంశీ దర్శకత్వంలో రైతు అనే సినిమాను ప్రారంభించబోతున్నాడు బాలకృష్ణ.