'విరాటపర్వం 1992'.... సాయి పల్లవి ఫిక్స్ ?

Friday,June 08,2018 - 04:06 by Z_CLU

ఇటివలే శ్రీ విష్ణుతో ‘ నీదీ నాదీ ఒకే కథ’ సినిమాను తెరకెక్కించి ప్రశంసలు అందుకున్న డైరెక్టర్ వేణు ఉడుగుల నెక్స్ట్ సాయి పల్లవి , నివిన్ పౌల్ లతో ఓ సినిమా చేయబోతున్నాడని టాక్. ఇప్పటికే సాయి పల్లవి కి స్క్రిప్ట్ వినిపించి గ్రీన్ సిగ్నల్ అందుకున్న ఈ డైరెక్టర్ త్వరలోనే నివిన్ కి కూడా స్టోరీ నెరేట్ చేయబోతున్నాడని సమాచారం.

త్వరలోనే సెట్స్ పైకి రానున్న ఈ సినిమాకు ‘విరాటపర్వం 1992 ‘ అనే టైటిల్ ను పరిశీలుస్తున్నారు. రాజకీయ నేపధ్యంలో జరిగే ఎమోషనల్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్నఈ సినిమాను శ్రీలక్ష్మీ వెంకటేశ్వరా సినిమాస్ బ్యానర్ పై ప్రసాద్ చుక్కపల్లి-సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా నిర్మించనున్నారు.