అల్లరి నరేష్, సునీల్ 'సిల్లీ ఫెలోస్' ఫస్ట్ లుక్
Friday,June 08,2018 - 06:24 by Z_CLU
కామెడి హీరోలు అల్లరి నరేష్, సునీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాకు ‘సిల్లీ ఫెలోస్’ అనే టైటిల్ ను ఖరారు చేసి ఫస్ట్ లుక్ విడుదల చేసారు..హైదరాబాద్ లో జరిగిన ప్రెస్ మీట్ లో అల్లరి నరేష్, సునీల్ కలిసి ఈ ఫస్ట్ లుక్ ను లాంచ్ చేసారు.

భీమినేని శ్రీనివాస్ దర్శకత్వంలో ఫుల్లెంగ్త్ ఫన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా ఇటివలే షూటింగ్ ఫినిష్ చేసుకుంది. బ్లూ ప్లానెట్ ఎంటర్‌టైన్‌మెంట్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్‌పై కిరణ్ రెడ్డి, భరత్ చౌదరి నిర్మిస్తున్న ఈ సినిమాలో చిత్ర శుక్ల కథానాయికగా నటిస్తుంది. డిజే వసంత మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. జులై లో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.