శతమానం భవతి డైరెక్టర్ నెక్స్ట్ సినిమా అదే...?

Friday,June 08,2018 - 01:43 by Z_CLU

ప్రస్తుతం నితిన్ హీరోగా ‘శ్రీనివాస కళ్యాణం’ సినిమాను తెరకెక్కిస్తున్న దర్శకుడు సతీష్ వేగేశ్న త్వరలోనే ఓ స్టార్ హీరోతో సినిమా ప్లాన్ చేస్తున్నాడు. ‘శతమానం భవతి’ గ్రాండ్ హిట్ తర్వత ఫ్యామిలీ మూవీస్ కి కేరాఫ్ అడ్రెస్ గా మారిన  సతీష్ వేగేశ్న ఇప్పటికే  ఓ హీరోకి కథ వినిపించి గ్రీన్ సిగ్నల్ అందుకున్నాడని సమచారం.

ప్రస్తుతం ‘శ్రీనివాస కళ్యాణం’ షూటింగ్ తో  బిజీ గా ఉన్న సతీష్ వేగేశ్న నెక్స్ట్ డైరెక్ట్  చేయబోయే సినిమా ఇదేనని తెలుస్తుంది. ఈ సినిమాను దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కే.ఎల్.నారాయణ నిర్మించనున్నాడని టాక్.