మెగా ఫ్యామిలీ నుండి మరో హీరో.. అంతా రెడీ ?

Sunday,September 09,2018 - 12:11 by Z_CLU

మెగా స్టార్ చిరంజీవి నుండి మొదలుకొని ఇప్పటి తరం హీరోలు వరుణ్ తేజ్ , సాయి ధరం తేజ్ వరకూ మెగా ఫ్యామిలీ లో చాలా మంది హీరోలున్నారు.. మెగా టాగ్ తో ప్రేక్షకులకు పరిచైమనప్పటికీ ఆ తర్వాత అందరూ తమ టాలెంట్ తో హీరోలుగా రాణిస్తున్నవారే.. ఇప్పుడు మెగా ఫ్యామిలీ నుండి మరో యంగ్ హీరో సిల్వర్ స్క్రీన్ పై ఎంట్రీ ఇవ్వబోతున్నాడని తెలుస్తుంది… అతనే వైష్ణవ్ తేజ్.. మెగా సుప్రీం హీరో సాయి ధరం తేజ్ తమ్ముడు వైష్ణవ్ త్వరలోనే హీరోగా పరిచయం కానున్నాడు.

ప్రస్తుతం వైష్ణవ్ తేజ్ ఎంట్రీ సినిమాకి సంబంధించి పనులు శరవేగంగా జరుగుతున్నాయని, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో ఈ సినిమా ఉంటుందని తెలుస్తుంది.. ఈ సినిమాను ఓ డెబ్యూ డైరెక్టర్ డైరెక్ట్ చేయనున్నాడని సమాచారం…త్వరలోనే ఈ సినిమాపై అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చే ఛాన్స్ ఉంది.