'శైలజా రెడ్డి అల్లుడు'... వెన్నెల కిషోర్ కామెడి హైలైట్

Sunday,September 09,2018 - 01:16 by Z_CLU

ప్రస్తుతం తన మార్క్ కామెడితో థియేటర్స్ లో కడుపుబ్బా నవ్విస్తూ సినిమా సక్సెస్ లో కీ రోల్ పోషిస్తున్న వెన్నెల కిషోర్ ప్రేక్షకులను మరోసారి హిలేరియస్ గా నవ్వించడానికి రెడీ అవుతున్నాడు. వెన్నెల కిషోర్ నటించిన లేటెస్ట్ మూవీ ‘శైలజా రెడ్డి అల్లుడు’ ఈ నెల 13న థియేటర్స్ లోకి రానుంది..ఈ సినిమాలో ఎంట్రీ నుండి ఎగ్జిట్ వరకూ వెన్నెల కిషోర్ హిలేరియస్ గా నవ్విస్తాడనే టాక్ వినిపిస్తుంది..

లేటెస్ట్ గా డైరెక్టర్ మారుతీ కూడా “వెన్నెల కిషోర్ కామెడి ట్రాక్ ప్రేక్షకులను బాగా నవ్విస్తుందని ఆ కామెడి ట్రాక్ సినిమాకే హైలైట్” అంటూ చెప్పుకొచ్చాడు.. ” హీరో కంపెనీలో ఓ జాబ్ చేస్తూ సినిమా మొత్తం హీరోతో ట్రావెల్ అయ్యే క్యారెక్టర్ లో కిషోర్ కనిపిస్తాడని… తన డైలాగ్స్ , బిహేవియర్ చాలా విచిత్రంగా ఉంటాయని.. ఏది డైరెక్ట్ గా చెప్పకుండా ఇన్ డైరెక్ట్ గా చెప్తూ నవ్విస్తాడని..ప్రతీ విషయాన్ని ఏదో ఒక పోలికతో చెప్పే ప్రయత్నం చేస్తాడని. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో కిషోర్ కామెడికి నవ్వని వారుండరని” క్లారిటీ ఇచ్చాడు మారుతి. సో ‘శైలజా రెడ్డి’ తో వెన్నెల కిషోర్ మరో హిట్ ను తన ఖాతాలో వేసుకోబోతున్నాడన్నమాట.