ప్రభాస్ నుండి డబుల్ బొనంజా

Sunday,September 09,2018 - 11:03 by Z_CLU

యంగ్ రెబెల్ స్టార్ నుండి ఈ ఏడాది ఒక్క సినిమా కూడా రాలేదు… గతేడాది ‘బాహుబలి 2’ తో థియేటర్స్ లోకి ఎంట్రీ ఇచ్చి బిగ్గెస్ట్ హిట్ అందుకున్న ప్రభాస్ ప్రస్తుతం ‘సాహో’ తో సెట్స్ పై ఉన్నాడు.. ప్రారంభమై చాలా నెలలే అవుతున్నా బాహుబలి తర్వాత ప్రభాస్ నటిస్తున్న సినిమా కావడం పైగా భారీ బడ్జెట్ తెరకెక్కుతుండడంతో కాస్త ఆలస్యం అవుతుంది.. అందుకే అనౌన్స్మెంట్ రోజే 2019 రిలీజ్ అంటూ క్లారిటీ ఇచ్చేసారు మేకర్స్. ఇక ఈ ఏడాది తన అభిమానులను నిరుత్సాహ పరిచిన ప్రభాస్ వచ్చే ఏడాది మాత్రం రెండు సినిమాలతో ఫాన్స్ ను ఫుల్ ఖుషి చేయబోతున్నాడు.

‘సాహో’ తో పాటే రాధా కృష్ణ డైరెక్షన్ లో చేయబోయే సినిమాను కూడా సెట్స్ పై పెట్టి ఒకే సారి రెండు సినిమాలను ఫినిష్ చేయబోతున్నాడు ప్రభాస్.. ఇటివలే పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ సినిమా కూడా వచ్చే ఏడాదే థియేటర్స్ లోకి రానుంది.. సో సమ్మర్ లో సాహో గా వచ్చి ఎండింగ్ లవ్ స్టోరీ తో మెస్మరైజ్ చేస్తాడన్నమాట ప్రభాస్.