నాని-సాయిపల్లవి మరోసారి

Tuesday,June 23,2020 - 12:08 by Z_CLU

వీళ్లిద్దరిదీ సూపర్ హిట్ కాంబినేషన్ అనే సంగతి అందరికీ తెలిసిందే. ఎంసీఏ సినిమాలో కలిసి నటించారు నాని-సాయిపల్లవి. ఆ సినిమాలో ఈ పెయిర్ కు మంచి మార్కులు పడ్డాయి. ఇద్దరూ మంచి పెర్ఫార్మర్లు కావడంతో సినిమాలో కెమిస్ట్రీ బాగా పండింది. అందుకే ఈ కాంబినేషన్ పై అంచనాలు పెరిగాయి.

ఎట్టకేలకు ఈ జంట మరోసారి కలుస్తోంది. త్వరలోనే సెట్స్ పైకి రాబోతున్న శ్యామ్ సింగరాయ్ సినిమాలో నాని-సాయిపల్లవి మరోసారి కలిసి నటించబోతున్నారు. కోల్ కతా బ్యాక్ డ్రాప్ లో డిఫరెంట్ కాన్సెప్ట్ తో రాబోతున్న ఈ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ వెరీ వెరీ స్పెషల్ గా ఉంటుందట. అందుకే ఆ పాత్రను చేయడానికి అంగీకరించింది సాయిపల్లవి.

గతంలో టాక్సీవాలా లాంటి సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ తీశాడు రాహుల్ సంకృత్యాన్. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత శ్యామ్ సింగరాయ్ తో మెగాఫోన్ పట్టుకోబోతున్నాడు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై రాబోతున్న ఈ సినిమాలో సెకెండ్ హీరోయిన్ కూడా ఉంది. ఆ పాత్రను ఇంకా సెలక్ట్ చేయలేదు.

ప్రస్తుతం చేస్తున్న టక్ జగదీష్ పూర్తయిన వెంటనే ఈ సినిమాను స్టార్ట్ చేస్తాడు నాని. ఈ గ్యాప్ లో విరాటపర్వం సినిమాను కంప్లీట్ చేస్తుంది సాయిపల్లవి.