బన్నీ కెరీర్ లో బెస్ట్ క్యారెక్టరైజేషన్

Tuesday,June 23,2020 - 12:27 by Z_CLU

డీజే.. దువ్వాడ జగన్నాథమ్
బన్నీ కెరీర్ లో ఈ సినిమాకు ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది. స్టయిలిష్ స్టార్ కెరీర్ లో అతడు చేసిన పాత్రల్లో బెస్ట్ క్యారెక్టర్స్ లో ఒకటిగా నిలిచిపోతుంది దువ్వాడ జగన్నాథమ్ పాత్ర.

హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు రిలీజై ఇవాళ్టికి మూడేళ్లు పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా #3YearsForDJSensation అనే హ్యాష్ ట్యాగ్ తో దువ్వాడ జగన్నాథమ్ సోషల్ మీడియాలో మరోసారి వైరల్ అవుతున్నాడు.

డీజే మూడేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా బన్నీ రియాక్ట్ అయ్యాడు. తన కెరీర్ లో మెమొరబుల్ మూవీస్ లో ఒకటిగా డీజే నిలిచిపోతుందని ట్వీట్ చేశాడు. ఈ సందర్భంగా దర్శకుడు హరీష్, నిర్మాత దిల్ రాజు, హీరోయిన్ పూజా హెగ్డే, మ్యూజిక్ డైరక్టర్ డీఎస్పీకి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాడు.

డీజే మూడేళ్లు పూర్తయిన సందర్భంగా అల్లు అర్జున్ ఆర్మీ సంబరాలు షురూ చేసింది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇప్పుడు డీజే మేనియానే కనిపిస్తోంది. దీన్ని మరింత పెంచేలా బన్నీ పీఆర్ టీమ్ ప్రత్యేకంగా కొన్ని అన్-సీన్ ఫొటోస్ రిలీజ్ చేసింది. ఇప్పుడు మీరు చూస్తున్న స్టిల్స్ అవే.

దువ్వాడ జగన్నాథమ్-DJ Full Movie