హిట్ పెయిర్ మళ్లీ కలుస్తోంది?

Tuesday,May 26,2020 - 03:28 by Z_CLU

నాని-సాయిపల్లవి
ఈ కాంబినేషన్ కు మంచి క్రేజ్ ఉంది. ఎంసీఏ సినిమా హిట్ అయిందనే విషయంతో పాటు ఇద్దరు పెర్ఫార్మర్స్ కలిసి నటిస్తే చూడాలని ఎవరికైనా ఉంటుంది. ఇప్పుడీ కాంబో మరోసారి రిపీట్ కాబోతోంది. నేచురల్ స్టార్ తో నేచురల్ బ్యూటీ మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోబోతోంది.

అన్నీ అనుకున్నట్టు జరిగితే శ్యామ్ సింగరాయ్ ప్రాజెక్టులో నాని సరసన సాయిపల్లవిని సెట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు మేకర్స్. ప్రస్తుతం ఈ నేచురల్ బ్యూటీ రానాతో విరాటపర్వం సినిమా చేస్తోంది. మరోవైపు నాగచైతన్యతో లవ్ స్టోరీ చేస్తోంది. ఈ రెండు దాదాపు ఫినిషింగ్ స్టేజ్ కు వచ్చేశాయి.

సో.. నాని సరసన మరోసారి నటించడానికి సాయిపల్లవికి కాల్షీట్ల సమస్య ఉండకపోవచ్చు. ఎటొచ్చి తన పాత్ర బాగుండాలి. క్యారెక్టర్ బాగుంటే సాయిపల్లవి నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేసినట్టే.