పూరి నెక్స్ట్ సినిమా అదేనా ?

Tuesday,June 23,2020 - 12:01 by Z_CLU

ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ లో ఒకరైన పూరి జగన్నాథ్ కి డ్రీం ప్రాజెక్ట్ ఉందన్న సంగతి తెలిసిందే. ‘జనగణమన’ అనే టైటిల్ తో ఓ పొలిటికల్ డ్రామా సిద్దం చేసుకొని ఎప్పట్నుంచో ఆ సినిమా చేయాలనుకుంటున్నాడు. మహేష్ బాబు తో ఆ సినిమా చేయాలనుకొని కొన్ని కారణాల వల్ల చేయలేకపోయాడు పూరి. అప్పటి నుండి తన డ్రీం ప్రాజెక్ట్ గురించి చాలా సందర్భాల్లో చెప్తూనే ఉన్నాడు.

తాజాగా ఆ సినిమాపై మరోసారి క్లారిటీ ఇచ్చాడు పూరి జగన్నాథ్. తన డ్రీం ప్రాజెక్ట్ ను త్వరలోనే స్టార్ట్ చేస్తానని ప్రకటించాడు.. అంతే కాదు ఆ సినిమాను పాన్-ఇండియా లెవెల్ లో తెరకెక్కించబోతునట్లు ప్రకటించాడు. దీంతో విజయ్ సినిమా తర్వాత పూరి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇదేనంటూ ప్రచారం మొదలైంది.

తన డ్రీం ప్రాజెక్ట్ ను పూరి ఏ హీరోతో తీస్తాడనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పూరి మహేష్ తోనే ఆ సినిమా చేస్తాడా లేదా మరో హీరో ను ఫైనల్ చేసుకున్నాడా అనేది తెలియాల్సి ఉంది.