సాయి పల్లవి ‘హేయ్ పిల్లగాడ’ రిలీజ్ డేట్

Saturday,November 11,2017 - 10:04 by Z_CLU

మలయాళంలో సూపర్ హిట్టయిన ‘కలి’ సినిమాకి తెలుగులో ‘హేయ్ పిల్లగాడ’ టైటిల్ ని ఫిక్స్ చేశారు మేకర్స్. అల్టిమేట్ లవ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్, సాయిపల్లవి హీరో హీరోయిన్స్ గా నటించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులుఇ జరుపుకుంటున్న ఈ సినిమా నవంబర్ 24 న రిలీజవుతుంది.

మలయాళంలో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ సినిమా తెలుగులోనూ అదే రేంజ్ లో సక్సెస్ అవ్వడం గ్యారంటీ అని కాన్ఫిడెంట్ గా ఉన్నారు ఫిల్మ్ మేకర్స్. సమీర్ తాహిర్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాకి గోపీ సుందర్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు. D.V. కృష్ణ నిర్మించిన ఈ సినిమా లక్ష్మీ చెన్నకేశవ ఫిలిమ్స్ బ్యానర్ పై తెలుగులో రిలీజవుతుంది.