సాహో ఏపీ, నైజాం ఫస్ట్ డే కలెక్షన్

Saturday,August 31,2019 - 11:30 by Z_CLU

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన సాహో సినిమా మొదటిరోజు దుమ్ముదులిపింది. విడుదలైన ఫస్ట్ డేనే వంద కోట్ల రూపాయల గ్రాస్ సాధించింది. ప్రభాస్ ఈ ఫీట్ సాధించడం వరుసగా ఇది రెండోసారి. ఇలా బ్యాక్ టు బ్యాక్ మొదటి రోజే వంద కోట్ల గ్రాస్ సాధించిన హీరో, సౌత్ లో ప్రభాస్ ఒక్కడే. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు 35 కోట్ల 30 లక్షల రూపాయల షేర్ వచ్చింది.

తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున విడుదలైన సాహో సినిమా రెండు ప్రాంతాల్లో మాత్రం బాహుబలి-2 రికార్డును క్రాస్ చేసింది. మరీ ముఖ్యంగా నైజాంలో బాహుబలి-2 రికార్డును సాహో క్రాస్ చేయడం సంచలనంగా మారింది. నైజాంలో బాహుబలి-2కు 9 కోట్ల రూపాయల షేర్ వస్తే, సాహోకు 9 కోట్ల 40 లక్షల రూపాయల షేర్ వచ్చింది. అలా నైజాంలో ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది సాహో.

మరోవైపు నెల్లూరు లో కూడా ఇది బాహుబలి-2ను అధిగమించింది. బాహుబలి-2కు నెల్లూరులో 2 కోట్ల 8 లక్షల రూపాయల షేర్ వస్తే, సాహోకు ఏకంగా 2 కోట్ల 56 లక్షల రూపాయల షేర్ వచ్చింది. నైజాం, నెల్లూరు మినహా మిగిలిన అన్ని ప్రాంతాల్లో బాహుబలి-2ను క్రాస్ చేయలేకపోయింది సాహో.

ఏపీ, నైజాం ఫస్ట్ డే షేర్
నైజాం – రూ. 9.40 కోట్లు
సీడెడ్ – రూ. 4.70 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 3.77 కోట్లు
ఈస్ట్ – రూ. 4.42 కోట్లు
వెస్ట్ – రూ. 3.60 కోట్లు
గుంటూరు – రూ. 4.70 కోట్లు
నెల్లూరు – రూ. 2.20 కోట్లు
కృష్ణా – రూ. 2.51 కోట్లు