వెంకీ నెక్ట్స్ మూవీ ఫిక్స్

Saturday,August 31,2019 - 12:42 by Z_CLU

ఒక సినిమా పూర్తయితే గానీ మరో సినిమా ఎనౌన్స్ చేయడు వెంకటేష్. అవసరమైతే షార్ట్ గ్యాప్ తీసుకోవడానికి కూడా రెడీ. అలాంటి వెంకీ ఈసారి మాత్రం ఓ సినిమా సెట్స్ పై ఉంటుండగానే మరో సినిమా ఎనౌన్స్ చేశాడు. త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో త్వరలోనే సెట్స్ పైకి వెళ్లబోతున్నాడు.

ప్రస్తుతం వెంకీమామ సినిమా చేస్తున్నాడు వెంకటేశ్. ఈ మూవీ కంప్లీట్ అయిన వెంటనే సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో సినిమాను స్టార్ట్ చేస్తాడు. అన్నీ అనుకున్నట్టు జరిగితే నవంబర్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఉంటుంది.

నేను లోకల్, సినిమా చూపిస్త మామ, హలో గురు ప్రేమకోసమే లాంటి సినిమాలు డైరక్ట్ చేశాడు త్రినాధరావు నక్కిన. ఈ సినిమాలో వెంకీ పోలీస్ గెటప్ లో కనిపిస్తాడనే రూమర్ ఉంది. త్వరలోనే దీనిపై ఓ క్లారిటీ వస్తుంది.