సాహో నార్త్-ఇండియా ఫస్ట్ డే కలెక్షన్

Saturday,August 31,2019 - 10:58 by Z_CLU

నార్త్ ఇండియాలో గ్రాండ్ గా ఓపెన్ అయింది సాహో. తొలి రోజు ఈ సినిమాకు ఉత్తరాదిన ఏకంగా 25 కోట్ల 40 లక్షల రూపాయల నెట్ వచ్చింది. గతంలో నార్త్ లో బాహుబలి-2 క్రియేట్ చేసిన రికార్డును సాహో అందుకోలేకపోయినప్పటికీ.. బాహుబలి-2 తర్వాత అత్యథిక వసూళ్లు సాధించిన సౌత్ సినిమాగా రికార్డు సృష్టించింది. బాహుబలి-2కు మొదటి రోజు నార్త్ లో 41 కోట్ల రూపాయల నెట్ వచ్చింది.

తాజా వసూళ్లతో నార్త్ లో 2.O కలెక్ట్ చేసిన ఎమౌంట్ ను క్రాస్ చేసింది సాహో. రజనీకాంత్ నటించిన 2.Oకు ఉత్తరాదిన రూ. 20.25 కోట్లు నెట్ వచ్చింది. ఇప్పుడా రికార్డును సాహో అధిగమించింది.

నిజానికి సాహోకు అదనంగా మరో 2 కోట్లు రావాలి. రిలీజ్ టైమ్ కు ఈ సినిమా కంటెంట్, నార్త్ లోని చాలా ప్రాంతాలకు చేరుకోలేదు. అలా దాదాపు 60కి పైగా లొకేషన్లలో సాహో సినిమా షోలు సకాలంలో పడలేదు. ఇక హిందీ మూవీస్ తో కంపేర్ చేసి చూసుకుంటే.. బాలీవుడ్ లో ఈ ఏడాది మూడో బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలిచింది సాహో.