సాహో 2 వారాల వసూళ్లు

Friday,September 13,2019 - 12:33 by Z_CLU

350 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సాహో సినిమా నిన్నటితో 2 వారాల రన్ పూర్తిచేసుకుంది. విడుదలైన ఈ 14 రోజుల్లో ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో 81 కోట్ల రూపాయల షేర్ వచ్చింది. వరల్డ్ వైడ్ చూసుకుంటే ఈ సినిమా ఇప్పటికే 400 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసిన సంగతి తెలిసిందే.

అటు హిందీ వెర్షన్ లో ఈ సినిమా సూపర్ హిట్ అయింది. క్రిటిక్స్ దీనికి నెగెటివ్ రివ్యూస్ ఇచ్చినప్పటికీ, నార్త్ లో రికార్డు వసూళ్లతో దూసుకుపోతోంది సాహో. ఈ 2 వారాల్లో 140 కోట్ల 25 లక్షల రూపాయల నెట్ కలెక్ట్ చేసిన ఈ సినిమా, క్లోజింగ్ నాటికి 170 కోట్ల రూపాయల వరకు వసూలు చేసే అవకాశం ఉంది.

ఏపీ, నైజాం 14 రోజుల షేర్
నైజాం – రూ. 30 కోట్లు
సీడెడ్ – రూ. 11.63 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 9.91 కోట్లు
ఈస్ట్ – రూ. 7.13 కోట్లు
వెస్ట్ – రూ. 5.83 కోట్లు
గుంటూరు – రూ. 7.88 కోట్లు
నెల్లూరు – రూ. 4.32 కోట్లు
కృష్ణా – రూ. 5.20 కోట్లు