ఆర్ఎక్స్ 100 మూవీ ఫస్ట్ వీక్ వసూళ్లు

Thursday,July 19,2018 - 12:18 by Z_CLU

చిన్న సినిమాగా వచ్చిన ఆర్ఎక్స్-100 పెద్ద విజయం సాధించింది. నిన్నటితో వారం రోజుల రన్ పూర్తిచేసుకున్న ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో 7 కోట్ల 53 లక్షల రూపాయల షేర్ వచ్చింది. విడుదలైన మొదటి రోజే నైజాంలో కోటి రూపాయల షేర్ రాబట్టి, అందర్నీ ఆశ్చర్యపరిచిన ఈ సినిమా వర్కింగ్ డేస్ లో కూడా స్టడీగా కలెక్షన్లు రాబట్టడం విశేషం.

సోమ, మంగళ, బుధవారాలు కూడా ఈ సినిమాకు హౌజ్ ఫుల్ షోలు నడిచాయి. అందుకే వారం రోజుల్లోనే 7 కోట్ల 53 లక్షల రూపాయల షేర్ రాబట్టగలిగింది ఈ సినిమా. బడ్జెట్ పరంగా చూసుకుంటే.. విడుదలైన 7 రోజులకే నాలుగింతల లాభం ఆర్జించింది ఆర్ఎక్స్-100.

ఏపీ, నైజాం ఆర్ఎక్స్-100 ఫస్ట్ వీక్ షేర్
నైజాం – రూ. 3.63 కోట్లు
సీడెడ్ – రూ. 0.88 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 0.86 కోట్లు
ఈస్ట్ – రూ. 0.59 కోట్లు
వెస్ట్ – రూ. 0.44 కోట్లు
గుంటూరు – రూ. 0.49 కోట్లు
కృష్ణా – రూ. 0.47 కోట్లు
నెల్లూరు – రూ. 0.17 కోట్లు

7 రోజుల షేర్ – రూ. 7.53 కోట్లు