‘గీతా గోవిందం’ టీజర్ రెడీ టు రిలీజ్

Thursday,July 19,2018 - 01:00 by Z_CLU

ఆగష్టు 15 న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న విజయ్ దేవరకొండ ‘గీతా గోవిందం’ సినిమాపై క్రియేట్ అయిన క్రేజ్ మీటర్, రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. దానికి తగ్గట్టు ఫిల్మ్ మేకర్స్ కూడా ఈ సినిమాపై మరిన్ని ఎక్స్ పెక్టేషన్స్ క్రియేట్ అయ్యేలా అగ్రెసివ్ మోడ్ లో సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. రీసెంట్ గా ఈ సినిమా ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేసి ఇంప్రెస్ చేసిన ఫిల్మ్ మేకర్స్ ఈ నెల 22 న మార్నింగ్ 11 : 05 గంటలకు  ఈ సినిమా టీజర్ ని రిలీజ్ చేయనున్నారు.

సినిమాలో అగ్రెసివ్ గా కనిపించాల్సి వచ్చినా కూల్ గోయింగ్ కుర్రాడిలా కనిపించాల్సి వచ్చినా తన మార్క్ ఎలివేట్ అయ్యేలా చూసుకుంటాడు విజయ్ దేవరకొండ. అందుకే ఈ సినిమాలో తమ ఫేవరేట్ హీరో ఎలాంటి రోల్ లో  కనిపిస్తాడోనన్న క్యూరాసిటీతో పాటు, ఇంతకీ ఈ సినిమా థీమ్ ఏమై ఉండబోతుందనే ఆలోచన ఇప్పటికే ఫ్యాన్స్ లో రేజ్ అయి ఉంది.

 

రష్మిక మండన్న హీరోయిన్ గా నటించిన పరశురాం డైరెక్షన్ లో తెరకెక్కుతుంది. గోపీ సుందర్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సినిమా GA2 పిక్చర్స్ బ్యానర్ పై తెరకెక్కుతుంది.