ఆగస్ట్ లో సుమంత్ కొత్త సినిమా

Thursday,July 19,2018 - 12:06 by Z_CLU

సుమంత్ కొత్త సినిమా ‘ఇదం జగత్’ ఫాస్ట్ పేజ్ లో షూటింగ్ జరుపుకుంటుంది. ‘మళ్ళీరావా’ లాంటి రొమాంటిక్ ఎంటర్ టైనర్ తరవాత కంప్లీట్ గా డిఫెరెంట్ ఎంటర్ టైనర్ ని ఎంచుకున్న సుమంత్ ఈ సినిమాలో నెగెటివ్ షేడ్స్ లో ఉన్న క్యారెక్టర్ లో కనిపించనున్నాడు. అయితే ఈ సినిమాను ఆగష్టు సెకండాఫ్ లో రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు ఫిల్మ్ మేకర్స్.

రీసెంట్ గా రిలీజైన ఈ సినిమా ఫస్ట్ లుక్ మ్యాగ్జిమం ఆడియెన్స్ ని రీచ్ అవ్వడంలో సక్సెస్ అయింది. ఒక సక్సెస్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ తరవాత  సుమంత్ మరోసారి అదే జోనర్ ని పిక్ చేసుకుంటాడని ఎక్స్ పెక్ట్ చేసిన ఫ్యాన్స్ కి, ‘ఇదం జగత్’ లాంటి థ్రిల్లర్ ని పిక్ చేసుకుని సర్ ప్రైజ్ చేశాడు సుమంత్.

 

 ఈ సినిమాలో అంజు కురియన్ హీరోయిన్ గా నటిస్తుంది. జొన్నలగడ్డ పద్మావతి, గంగపట్నం శ్రీధర్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శ్రీచరణ్ పాకాల  మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.  అనిల్ శ్రీకంఠం డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ ని త్వరలో రిలీజ్ చేస్తారు.