ఇకపై నో మొహమాటమ్స్...

Sunday,January 08,2017 - 10:01 by Z_CLU

బాలయ్య ప్రభంజనం స్టార్ట్ అయింది. ఇది మనం చెప్పే మాట కాదు, స్వయంగా అభిమానులు ఇస్తున్న స్టేట్ మెంట్. ఈమధ్య అభిమానులతో ఆఫ్-స్క్రీన్ ఇంటరాక్ట్ అయిన బాలయ్య.. తన కెరీర్, ఫ్యూచర్ ప్రాజెక్టులపై ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. పనిలోపనిగాా మనసు విప్పి వాళ్లతో మాట్లాడారు. తన ఫీలింగ్స్ అన్నీ షేర్ చేసుకున్నారు. ఇందులో భాగంగా.. తన కెరీర్ కు సంబంధించి ఇకపై కాంప్రమైజ్ అయ్యేది లేదని తెగేసి చెప్పారు బాలయ్య.

గతంలో కొన్ని పరిస్థితులు,లెక్కలకు తగ్గట్టు మొహమాటాలకు పోవాల్సి వచ్చిందని, ఇకపై మాత్రం అలాంటి మొహమాటాలు అస్సలు ఉండవని తేల్చిచెప్పారు బాలయ్య. గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా నుంచి తన కెరీర్ లో కొత్త శకం ప్రారంభం కాబోతుందని చెప్పిన బాలకృష్ణ… ఇకపై ప్రతి సినిమాతో ఓ కొత్త బాలయ్యను చూస్తారని అభిమానులతో అన్నారు. బాలయ్య మాటలతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.