నిఖిల్ సినిమాతో...

Saturday,October 22,2016 - 05:00 by Z_CLU

అప్పట్లో నాగార్జున సరసన చంద్ర లేఖ, వెంకటేష్ తో ‘ప్రేమతో రా’ సినిమాల్లో కనిపించిన బ్యూటీ ఇషికా… టాలీవుడ్ లో రీఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతుంది. తెలుగు లో రెండు సినిమాల తరువాత తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో నటిస్తూ బిజీ అయిపోయిన ఈ కథానాయిక… తాజాగా రెండు భాషల్లో మూడు సినిమాలు చేస్తూ సెకెండ్ ఇన్నింగ్స్ షురూ చేసింది.

నిఖిల్ తో దర్శకుడు సుధీర్ వర్మ  తెరకెక్కించబోయే ‘కేశవ’ సినిమాలో ఓ కీ రోల్ కోసం ఈ అలనాటి కథానాయికను సంప్రదించారట చిత్ర యూనిట్. క్యారెక్టర్ నచ్చడంతో  టాలీవుడ్ లో మళ్ళీ ఎంట్రీ ఇవ్వడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట ఇషిక. మరి ఈ సినిమాలో ఈ సీనియర్ భామ…ఏ పాత్ర లో కనిపిస్తుందో? చూడాలి.