ఫస్ట్ లుక్ హంగామా ....

Saturday,October 22,2016 - 06:10 by Z_CLU

ప్రభాస్ అభిమానులతో  పాటు  ప్రపంచవ్యాప్తంగా  సినిమా ప్రేమికులందరూ ఎంతో ఉత్కంఠ తో ఎదురుచూసిన ‘బాహుబలి-2’ ఫస్ట్ లుక్ విడుదలైంది. ‘బాహుబలి-2’ షూటింగ్ ప్రారంభమైన డే 1 నుండి సినిమాకు సంబంధించిన ఎటువంటి స్టిల్స్ బయటికి రాకుండా చిత్ర యూనిట్ జాగ్రత్త వహించడం తో ఈ చిత్ర ఫస్ట్ లుక్ పై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది.

 

చేతికి గొలుసులు చుట్టుకొని చేతిలో కత్తి పట్టుకుని పౌరుషంగా నడుస్తూ ప్రభాస్ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.

22-horizontal-empty

ప్రభాస్ జన్మదినాన్ని పురస్కరించుకొని ముంబై లో జరుగుతున్న ఫిలిం ఫెస్టివల్ లో ఈ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు చిత్ర యూనిట్.. ఈ వేడుకలో చిత్ర దర్శకుడు రాజమౌళి, యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, మిల్క్ బ్యూటీ తమన్న తో పాటు చిత్ర నిర్మాత శోబు యార్లగడ్డ పాల్గొన్నారు.