చిరు, ప్రభాస్ కలిశారు..

Saturday,October 22,2016 - 03:18 by Z_CLU

ఖైదీ సినిమా 34 ఏళ్ల క్రితం తెలుగు సినీ రంగాన్ని ఓ ఊపు ఊపింది…టాలీవుడ్ గ‌మ‌నాన్ని మలుపు తిప్పింది…. తెలుగు సినిమా గ‌మ్య‌న్ని మార్చేసింది… 34 ఏళ్ల త‌ర్వాత బాహుబ‌లి సినిమా తెలుగు సినిమాను అంత‌ర్జాతీయ స్థాయికి తీసుకెళ్లింది…. అన్ని రికార్డులు బ‌ద్ద‌లుకొట్టి ఆలిండియా రికార్డు సాధించింది… తెలుగోడి స‌త్తాను ఎలుగెత్తి చాటింది… అలాంటి బాహుబ‌లి ఖైదీని క‌లుసుకున్నాడు. ఖైదీ స్వ‌యంగా బాహుబ‌లి సెట్స్‌కి వెళ్లాడు. ప్రభాస్ ను ఆప్యాయంగా ఆలింగ‌నం చేసుకున్నాడు… ఖైదీ-బాహుబ‌లి క‌ల‌యిక సోషల్ మీడియాలో కెవ్వు కేక పుట్టించింది. తాజాగా చిరంజీవి 150వ సినిమా ఖైదీ నెంబ‌ర్ 150 షూటింగ్ రామోజీ ఫిలింసిటీలోశ‌ర‌వేగంగా సాగుతోంది… ఆ ప‌క్క‌నే మ‌రోచోట బాహుబ‌లి-2 షూటింగ్ కూడా జ‌రుగుతోంది. కాస్త ఫ్రీటైం దొరకడంతో స్వయంగా చిరంజీవి, బాహుబలి సెట్ ను సందర్శించారు. పనిలో పనిగా ప్రభాస్ కు కాస్త ముందుగానే పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. చిరును సెట్స్ లో చూసి ప్రభాస్ పొంగిపోయాడు.