Raviteja Chiranjeevi - మెగాస్టార్ సెట్స్ పైకి మాస్ రాజా

Saturday,July 16,2022 - 05:02 by Z_CLU

Raviteja joins Chiranjeevi-Bobby Movie Titled Waltair Veerayya

చిరంజీవి సినిమాలోకి రవితేజ వస్తాడా రాడా? ఎట్టకేలకు ఈ ప్రశ్నకు సమాధానం దొరికేసింది. చిరంజీవి-బాబి కాంబినేషన్ లో వస్తున్న సినిమాలోకి రవితేజ కూడా జాయిన్ అయ్యాడు. ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతున్న షెడ్యూల్ లో రవితేజ జాయిన్ అయ్యాడు. దీనికి సంబంధించిన వీడియోను కూడా మేకర్స్ రిలీజ్ చేశారు.

బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రవితేజ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే, ఈ చిత్రంలో అతను పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నాడు. పోలీస్ యూనిఫాంలో రవితేజ కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. 2 నెలల్లో రవితేజకు సంబంధించిన పోర్షన్ మొత్తం పూర్తి చేస్తారు. ఇది పూర్తయిన తర్వాత రవితేజ తన కొత్త సినిమా స్టార్ట్ చేస్తాడు.

ఈ సినిమాలో చేసేది కీలక పాత్రే అయినప్పటికీ, రవితేజకు భారీగా . రెమ్యూనరేషన్ ఇచ్చారు మేకర్స్.

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై రాబోతున్న ఈ సినిమాకు “వాల్తేరు వీరయ్య” అనే టైటిల్ అనుకుంటున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీత దర్శకుడు. శృతిహాసన్ హీరోయిన్.