Pelli SandaD - ఈరోజే వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్

Sunday,July 17,2022 - 09:36 by Z_CLU

ద‌ర్శ‌కేంద్రుడు కె. రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో రూపొందిన ‘పెళ్లి సంద‌D’ బుల్లితెరపై సందడి చేయబోతోంది. ఎన్నో బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రాల రూప‌క‌ల్ప‌న‌లో త‌న మేజిక్‌ను చూపించిన రాఘవేంద్రరావు న‌టుడిగా మారి తన శిష్యురాలు గౌరి రోణంకిని దర్శకురాలిగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన సినిమా ఇది ‘పెళ్లిసంద‌D’. ఓ నటుడిగా దర్శకేంద్రుడు కనిపించిన తొలి చిత్రం ఇది.

వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా మీ జీ తెలుగులో ఈరోజు ప్రసారం కాబోతోంది ఈ సినిమా. ఆర్కా మీడియా వ‌ర్క్స్‌, ఆర్‌.కె ఫిలిం అసోసియేట్స్ బ్యాన‌ర్స్‌పై కె.కృష్ణ మోహ‌న్ రావు స‌మ‌ర్ప‌ణ‌లో మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని నిర్మించిన ఈ సినిమా ప్రేక్షకులను అలరించి బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్ళు రాబట్టి సూపర్ హిట్ సాధించింది. ఇప్పుడు స్మాల్ స్క్రీన్ ఆడియన్స్ మనసులు గెలుచుకోనుంది.

రోషన్ హీరోగా, శ్రీలీల హీరోయిన్ గా పరిచయమైన ఈ సినిమా థియేటర్స్ లో రిలీజై మంచి వసూళ్ళు రాబట్టింది. ముఖ్యంగా దర్శకేంద్రుడి సాంగ్స్ పిక్చరైజేషన్ , కీరవాణి మ్యూజిక్ , శ్రీ లీల గ్లామర్ సినిమాకు ప్లస్ పాయింట్స్ గా నిలిచి అందరినీ ఆకట్టుకుంది.

పాటల కోసమే ఈ సినిమాను థియేటర్స్ లో మళ్ళీ మళ్ళీ చూసిన ఆడియన్స్ ఉన్నారు. ముఖ్యంగా రాజేంద్ర ప్రసాద్ కామెడీ , రోషన్ -శ్రీలీల లవ్ ట్రాక్, రాఘవేంద్రరావు స్టోరీ నెరేషన్, బ్యూటిఫుల్ సాంగ్స్, ఆకట్టుకునే పిక్చరైజేషన్ సినిమాలో హైలైట్స్ గా చెప్పుకోవచ్చు.

ఫ్యామిలీ అండ్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ‘పెళ్లి సందD’ను జీ తెలుగులో ఈరోజు సాయంత్రం చూసి ఎంజాయ్ చేయండి.

మీ ఇంట్లో పెళ్లి సందడి చేయడానికి సర్వం సిద్ధం! ఈ పెళ్లిసందడికి అందరూ ఆహ్వానితులే!