రష్మిక ఇంటర్వ్యూ

Sunday,September 23,2018 - 11:05 by Z_CLU

బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో దూసుకెళ్తున్న కన్నడ బ్యూటీ రష్మిక లేటెస్ట్ మూవీ ‘దేవదాస్’.. నాగ్-నాని కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 27 న రిలీజ్ కానుంది.. ఈ సందర్బంగా రష్మిక మీడియాతో మాట్లాడింది.. మరి దేవదాస్ గురించి రష్మిక ఏం చెప్పిందో…తెలుసుకుందాం.

 

గర్ల్ నెక్స్ట్ డోర్

సినిమాలో పూజా అనే చాలా సింపుల్ అమ్మాయి క్యారెక్టర్ లో కనిపిస్తాను.. గర్ల్ నెక్స్ట్ డోర్ లాంటి క్యారెక్టర్ ఇది.. నా క్యారెక్టర్ తో ఓ సప్రైజ్ ఎలిమెంట్ అల్లుకుని ఉంటుంది.. అదేంటనేది సినిమా చూసాక తెలుస్తుంది.

 

క్యారెక్టరే ముఖ్యం

ఏ సినిమా చేయలన్నా ముందుగా క్యారెక్టర్ నచ్చాలి.. పూజా అనే క్యారెక్టర్ నచ్చే ఈ సినిమా చేసాను.. కథలో ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ నాది. సో ఓకే చెప్పేసా.

ఫిదా అయిపోయా

షూటింగ్ టైంలో నాగ్ సార్-నాని కెమిస్ట్రీకి ఫిదా అయిపోయాను.. సినిమా చూసాక వాళ్ళిద్దరి కెమిస్ట్రీ కి అందరూ మెస్మరైజ్ అవుతారు. దేవ దాస్ కచ్చితంగా అలరిస్తారు.

 

డిఫరెంట్ సినిమా

తెలుగులో నేను చేసిన రెండు సినిమాలు ఎంటర్ టైనర్సే.. ఈ సినిమా కూడా పక్కా ఎంటర్టైనర్ కానీ కథ డిఫరెంట్ గా ఉంటుంది.. ఇద్దరి కథతో మల్టీ స్టారర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో నా క్యారెక్టర్ కూడా డిఫరెంట్ గా అనిపిస్తుంది.

 

చాలా నేర్చుకున్నా

నాని గారితో ఎక్కువ రోజులు చేసాను.. నాని గారి చాలా నేర్చుకున్నాను. ప్రతీ సీన్ లో ఇంప్రువైజేషన్స్ చెప్తూ ఉండేవారు.

 

హ్యాపీ పర్సన్

నాగార్జున గారితో వర్క్ చేసింది తక్కువే.. కేవలం రెండు రోజులు వర్క్ చేసాను.. ఆయనతో పనిచేసిన ఆ కొన్ని గంటలు ఎంతో హ్యాపీ గా ఉన్నా.. ఆయన చాలా హ్యాపీ పర్సన్.. ఎప్పుడూ ఎదోక జోక్ చెప్తూ ఫన్నీ గా మాట్లాడుతూ ఎంటర్టైన్ చేస్తారు. ఆయన నటించిన ఈ సినిమాలో నేను కూడా పార్ట్ అవ్వడం వెరీ హ్యాపీ.

ప్రాక్టీస్ చేస్తున్నా

డియర్ కామ్రేడ్ లో క్రికెటర్ గా నటిస్తున్నా… ఆ క్యారెక్టర్ కోసం క్రికెట్ ప్రాక్టీస్ చేస్తున్నా. కచ్చితంగా ఆ సినిమాలో నా క్యారెక్టర్ అందరినీ మెప్పిస్తుంది. విజయ్ తో మళ్ళీ నటించడం హ్యాపీ.

 

ఈ రోల్ కోసం ప్రార్దించా

ఈ సినిమా స్టోరీ చెప్పినప్పుడు.. కచ్చితంగా సెలెక్ట్ అవ్వాలని ప్రే చేసాను. ఆడిషన్ ఇచ్చాక డైరెక్టర్ ఆది గారు ఈ రోల్ కి పర్ఫెక్ట్ ఆనగానే హ్యాపీ గా ఫీలయ్యాను.

 

ఆలోచిస్తున్నా

తమిళ్ లో ఆఫర్స్ వస్తున్నాయి.. కానీ ఈ టైంలో ఒక డెబ్యూ హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వాలంటే వాళ్ళ అంచనాలు అందుకోగలగాలి.. సో తమిళ్ లో చేయాలనీ ఉంది.. కానీ ఇంకొంచెం టైం పడుతుంది.