మరో ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తో శర్వా ?

Sunday,September 23,2018 - 12:14 by Z_CLU

ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉన్న యంగ్ హీరో శర్వానంద్ లేటెస్ట్ గా మరో సినిమా ఒకే చేసాడనే వార్త వినిపిస్తుంది… గతేడాది ‘శతమానం భవతి’ వంటి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తో తెలుగు ప్రేక్షకులను మెస్మరైజ్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న శర్వా మరో ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా ప్లాన్ చేస్తున్నాడు..

ఇటివలే శ్రీకాంత్ అడ్డాల చెప్పిన ఓ ఫ్యామిలీ కథకు శర్వా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తుంది. ఈ సినిమా శ్రీకాంత్ అడ్డాల స్టైల్ లోనే విలేజ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఉండబోతుందట.

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతుందని…గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ ఈ సినిమాను నిర్మించనున్నారని సమాచారం.. త్వరలోనే ఈ సినిమాపై అనౌన్స్ మెంట్ వచ్చే ఛాన్స్ ఉంది.