రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న విజయ్ దేవరకొండ 'నోటా'

Sunday,September 23,2018 - 10:09 by Z_CLU

లేటెస్ట్ గా ‘గీతా గోవిందం’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విజ‌య్ దేవ‌ర‌కొండ మ‌రో సినిమాతో రెడీ అయ్యాడు. విజయ్ న‌టిస్తున్న ద్విభాషా సినిమా ‘నోటా’ విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఆనంద్ శంక‌ర్ తెర‌కెక్కిస్తున్న ఈ సినిమాను అక్టోబర్ 5 న రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్… పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఓ రాజకీయ నాయకుడి క్యారెక్టర్ లో నటిస్తున్నాడు విజయ్.

జ్ఞాన‌వేల్ రాజా నిర్మిస్తున్న ఈ సినిమాలో విజయ సరసన మెహ్రీన్ హీరోయిన్ గా నటిస్తుంది… ప్రముఖ దర్శకుడు మురుగదాస్ ఓ గెస్ట్ రోల్ లో కనిపించనున్నాడు.. ప్ర‌స్తుతం ఈ సినిమాకు సంబంధించి పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వర్క్ జరుగుతుంది.