RangDe - బ్యాక్ టు బ్యాక్ ప్రమోషన్స్

Thursday,March 18,2021 - 02:42 by Z_CLU

నితిన్-కీర్తిసురేష్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న రంగ్ దే సినిమాకు సంబంధించి ప్రమోషన్ ఉపందుకుంది. ఈ మూవీకి సంబంధించి 3 భారీ ఈవెంట్లు ప్లాన్ చేశారు. రేపు కర్నూలులో జరగబోయే ట్రయిలర్ లాంఛ్ ఈవెంట్ తో పాటు మరో 2 బిగ్ ఈవెంట్స్ షెడ్యూల్ చేశారు.

ఈ విషయాల్ని కాస్త ఫన్నీగా చెబుతూ.. ఓ వీడియో రిలీజ్ చేశారు మేకర్స్. నితిన్, సుహాస్, అభినవ్ కలిసి చేసిన ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.