వకీల్ సాబ్ కోసం చిరు-చరణ్?

Thursday,March 18,2021 - 06:53 by Z_CLU

మరికొన్ని రోజుల్లో వకీల్ సాబ్ హంగామా మొదలుకాబోతోంది. ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ ప్రమోషనల్ ఈవెంట్ ను ఏప్రిల్ 3న ప్లాన్ చేశారు. అందరూ అనుకుంటున్నట్టు విజయవాడలో కాకుండా, హైదరాబాద్ లోనే ఈ ఈవెంట్ ప్లాన్ చేశారు.

ఈ మెగా ఈవెంట్ కు చిరంజీవి, రామ్ చరణ్ ను ప్రత్యేక అతిథులుగా ఆహ్వానించబోతున్నారట. ఇదే కనుక నిజమైతే చాన్నాళ్ల తర్వాత పవర్ స్టార్, మెగాస్టార్, మెగాపవర్ స్టార్ ను ఒకే వేదికపై చూస్తారు ఫ్యాన్స్.

వకీల్ సాబ్ సినిమాకు సంబంధించి ఇప్పటికే ప్రమోషన్ పీక్ స్టేజ్ లో నడుస్తోంది. తాజాగా రిలీజైన మెలొడీ సాంగ్ జనాల్లోకి చొచ్చుకుపోయింది. ఇప్పుడీ ”హై”ను ఇంకాస్త పెంచేందుకు భారీ ప్రమోషనల్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు. ఈ ఈవెంట్ లో ట్రయిలర్ లాంఛ్ చేస్తారు.

పవన్-శృతిహాసన్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో అంజలి, అనన్య, నివేతథామస్ కీలక పాత్రలు పోషించారు. వేణుశ్రీరామ్ డైరక్ట్ చేసిన ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఏప్రిల్ 9న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా థియేటర్లలోకి రాబోతున్నాడు వకీల్ సాబ్.