RangDe Trailer - అర్జున్-అను గిల్లికజ్జాలు

Friday,March 19,2021 - 06:33 by Z_CLU

“అర్జున్ చిన్నప్పుడే ఓ గర్ల్ ఫ్రెండ్ కావాలని దేవుడ్ని కోరుకుంటాడు. కోరుకున్నట్టుగానే దేవుడు అతడికి గర్ల్ ఫ్రెండ్ అనును ప్రసాదిస్తాడు. అయితే గర్ల్ ఫ్రెండ్ అనుకున్నది కాస్తా గయ్యాళి ఫ్రెండ్ అవుతుంది. అన్ని విషయాల్లో అర్జున్ ను డామినేట్ చేస్తుంది. చివరికి పెళ్లి కూడా. అర్జున్ కు ఇష్టం లేకపోయినా తాళి కట్టించుకుంటుంది. ఇలా గిల్లికజ్జాలతో మొదలైన వీళ్ల కాపురం ఎలా సుఖాంతమైందో తెలియాలంటే రంగ్ దే సినిమా చూడాల్సిందే.”

ఇది సినిమా రివ్యూ కాదు. రంగ్ దే ట్రయిలర్ లో చూపించిన ఎలిమెంట్స్. ఇలా మూవీపై లేనిపోని అంచనాలు పెంచకుండా ఉన్నదున్నట్టు క్రిస్టల్ క్లియర్ గా చెప్పేశారు మేకర్స్. ఇక అర్జున్-అనుల గొడవల్ని, ప్రేమల్ని, ఫన్ ను సిల్వర్ స్క్రీన్ పై చూసి ఎంజాయ్ చేయమని ఊరిస్తున్నారు.

ఈమధ్య కాలంలో ఇంత క్లియర్ గా సినిమా గురించి చెప్పిన ట్రయిలర్ రాలేదు. రంగ్ దే సినిమాకు ఇదే బలం కానుంది. ఈ ట్రయిలర్ తో సినిమాలో కంటెంట్ ఎలా ఉండబోతోందో ఆడియన్స్ కు ఓ క్లారిటీ వచ్చేసింది.

నితిన్, కీర్తిసురేష్ కెమిస్ట్రీ ట్రయిలర్ లో మెయిన్ ఎట్రాక్షన్ గా నిలిచింది. దేవిశ్రీప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, పీసీ శ్రీరామ్ విజువల్స్ ట్రయిలర్ లో పోటీపడ్డాయి. ట్రయిలర్ లోనే ఇలా ఉందంటే.. థియేటర్లలో విజువల్ ఫీస్ట్ గ్యారెంటీ.

ఈనెల 26న అర్జున్-అను థియేటర్లలోకి వస్తున్నారు. మీరు కూడా రండి.