'రంగ మార్తాండ' షూటింగ్ ప్రారంభం

Monday,November 25,2019 - 05:16 by Z_CLU

కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘రంగ మార్తాండ’ సినిమా షూటింగ్ మొదలైంది. ఈ రోజు ఉదయం వైజాగ్ లో షూటింగ్ ప్రారంభించారు. మొదటి సన్నివేశానికి తేజ గౌరవ దర్శకత్వం వహించగా న్యూమరాలజిస్ట్ బాలు మున్నాగి క్లాప్ ఇచ్చారు.

2016లో వచ్చిన మరాఠీ సినిమా ‘నటసామ్రాట్’కి రీమేక్ గా తెరకెక్కనున్న సినిమాలో ప్రకాశ్ రాజ్ ఆయన సరసన రమ్యకృష్ణ నటించనున్నారు. ‘శ్రీఆంజనేయం’ తరువాత కృష్ణవంశీ దర్శకత్వంలో రమ్యకృష్ణ చేస్తున్న సినిమా ఇదే. అభిషేక్ – మధు నిర్మిస్తున్న ఈ సినిమాకు ఇళయరాజా మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు.