AHIMSA టీజర్ తో మెప్పించిన తేజ

Friday,October 07,2022 - 10:37 by Z_CLU

వెండితెరపై వైవిధ్యమైన ప్రేమకథలని ఆవిష్కరించి ఘన విజయాలని సాధించిన తేజ దర్శకత్వంలో అభిరామ్ దగ్గుబాటి హీరోగా అరంగేట్రం చేస్తున్న యూత్ ఫుల్ లవ్, యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘అహింస ‘నుండి టీజర్‌ విడుదల చేశారు నిర్మాతలు.

జీవితంలో పెద్ద కలలు లేని కుర్రాడు అభిరామ్. వ్యవసాయం చేసుకుంటూ తనకున్న దానితో సంతోషంగా ఉంటాడు. హింసకు పూర్తిగా వ్యతిరేకి. అహింసా మార్గాన్ని అనుసరించే బుద్ధుని తత్వశాస్త్రాన్ని అనుసరించమని అందరికీ చెబుతుంటాడు. అయితే కొన్ని అనుకోని సంఘటనలతో అతని జీవితం మలుపు తిరుగుతుంది. అహింసని పాటించే అభిరాయ్ కి హింసాత్మక పరిస్థితులు ఎదురైతే ఏం జరిగిందనేది కథా నేపధ్యంగా టీజర్ చూస్తే అర్ధమౌతుంది.

తేజ ఒక అందమైన ప్రేమకథతో ఈ సినిమా తీసినట్టు టీజర్‌ను చూస్తుంటే అర్ధమౌతుంది. అలాగే కథలో బలమైన సంఘర్షణ వుందని తెలుస్తుంది. అభిరామ్ తన పాత్రకు పూర్తి న్యాయం చేయగా, గీతికకు బలమైనపాత్ర లభించింది. టీజర్‌లో సదా, మరికొన్ని పాత్రలు కూడా కనిపించాయి.

ఆర్‌పి పట్నాయక్ తన ప్లజంట్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో ప్రేమకథకు మరింత అందాన్ని జోడిస్తే, యాక్షన్ పార్ట్‌కి కూడా సరైన మూడ్‌ని సెట్ చేశారు. తేజ, ఆర్పీ పట్నాయక్ కలిసి మ్యాజిక్ క్రియేట్ చేయగా, సమీర్ రెడ్డి కెమెరా పనితనం అత్యున్నతంగా ఉంది. మొత్తంమీద, టీజర్ భారీ అంచనాలను పెంచింది. ఇది తేజ మార్క్ సినిమా అని భరోసా ఇస్తోంది.

ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై పి కిరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్‌ కాగ, అనిల్ అచ్చుగట్ల డైలాగ్స్ అందిస్తున్నారు. సుప్రియ ఆర్ట్ డైరెక్టర్. టీజర్ ద్వారా ప్రకటించినట్లుగా, అహింస త్వరలో థియేటర్లో గ్రాండ్ గా విడుదల కానుంది.