ఆ సినిమా తర్వాతే !

Sunday,May 05,2019 - 12:02 by Z_CLU

గుణ శేఖర్ డైరెక్షన్ లో  ‘హిరణ్య’ అనే భారీ బడ్జెట్ సినిమా చేయబోతున్నాడు రానా. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. అయితే ఈ సినిమా కంటే ముందు మరో సినిమాను ఫినిష్ చేయబోతున్నాడు రానా. వేణు ఉడుగుల డైరెక్షన్ లో నెక్స్ట్ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ‘విరాఠపర్వం’ అనే టైటిల్ తో డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కనున్న ఈ సినిమాను జూన్ నుండి సెట్స్ పై పెట్టబోతున్నాడు దగ్గుబాటి హీరో.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తయింది. రానా సరసన సాయి పల్లవి హీరోయిన్ గా నటించనుంది. లేటెస్ట్ గా ఓ స్పెషల్ క్యారెక్టర్ కోసం టబుని తీసుకున్నారు. శ్రీ లక్ష్మి వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సుధాకర్ ఈ సినిమాను నిర్మించనున్నాడు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుంది.