బన్నీ-సుకుమార్ సినిమాకు డేట్ ఫిక్స్

Sunday,May 05,2019 - 01:01 by Z_CLU

సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై రానున్న ఆ సినిమాకు మూహూర్తం ఫిక్స్ అయింది. ఈనెల 11న ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభించబోతున్నారు.

అయితే సినిమా మాత్రం అప్పుడే సెట్స్ పైకి రాదు. త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా స్టార్ట్ చేశాడు బన్నీ. ఆ మూవీకి సంబంధించి ఇప్పటివరకు ఫస్ట్ షెడ్యూల్ మాత్రమే పూర్తయింది. ఈ సినిమా కొలిక్కి వచ్చిన తర్వాతే సుకుమార్ మూవీ ఉంటుంది.

నిజానికి త్రివిక్రమ్ మూవీ తర్వాత వేణు శ్రీరామ్ దర్శకత్వంలో బన్నీ హీరోగా ఐకాన్ సినిమా స్టార్ట్ అవుతుందని అంతా అనుకున్నారు. సినిమా టైటిల్ లోగోను కూడా రిలీజ్ చేయడంతో అంతా అలా ఫీల్ అయ్యారు. కానీ ఐకాన్ కంటే ముందు సుకుమార్ సినిమా సెట్స్ పైకి రాబోతోంది.