మరో ఛాన్స్ ఇచ్చిన రవి తేజ

Sunday,May 05,2019 - 11:01 by Z_CLU

ప్రస్తుతం వి.ఐ.ఆనంద్ డైరెక్షన్ లో ‘డిస్కో రాజా’ సినిమా చేస్తున్న రవి తేజ నెక్స్ట్ గోపీచంద్ మలినేనితో సినిమా కన్ఫర్మ్ చేసుకున్నాడు. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘డాన్ శీను’ సూపర్ హిట్టైంది. ఇప్పుడు రవితేజతో మళ్ళీ అదే మేజిక్ ను రిపీట్ చేయాలని చూస్తున్నాడు గోపీచంద్. ఇప్పటికే ఈ సినిమాకు స్క్రిప్ట్ లాక్ అయిందని, త్వరలోనే గ్రాండ్ గా లాంచ్ కానుందని తెలుస్తోంది.

డిస్కో రాజా సినిమాను ఆగస్ట్ కల్లా కంప్లీట్ చేసి వెంటనే గోపీచంద్ మలినేని సినిమాను సెట్స్ పై పెట్టాలనే ప్లాన్ లో ఉన్నాడు రవి తేజ. ఈ సినిమాను కూడా ఇదే ఏడాదిలో థియేటర్స్ లోకి తీసుకురావాలని ఫిక్స్ అయ్యాడు. మరి ఈ రెండు సినిమాలతో మాస్ మహారాజ ఎలాంటి హిట్స్ అందుకుంటాడో..చూడాలి.